BNS సెక్షన్  1. సంక్షిప్త పేరు, పరిధి మరియు అమలు

(1) ఈ చట్టాన్ని ‘భారతీయ న్యాయ సంహిత, 2023’ అని పిలుస్తారు.

(2) కేంద్ర ప్రభుత్వం గెజెట్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఈ న్యాయ సంహితలో ఉన్న వివిధ నిబంధనలు వేర్వేరు తేదీల్లో అమల్లోకి వస్తాయి. ఆ నియమించిన తేదీ నుంచే అవి లాగు అవుతాయి.

(3) భారతదేశ పరిధిలో ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా, అటువంటి వ్యక్తి నేరస్తుడిగా పరిగణించబడతాడు. ఈ నిబంధనల ప్రకారం అతనికి తగిన శిక్ష విధించబడుతుంది.

(4) అప్పటికప్పుడు భారతదేశంలో అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఎవరైనా నేరం చేస్తే, ఈ న్యాయ సంహితలోని నిబంధనల ప్రకారం శిక్షలు అమలవుతాయి.

(5) ఈ న్యాయ సంహితలో ఉన్న నిబంధనలు ఈ క్రింది సందర్భాల్లో కూడా వర్తిస్తాయి:

ఉదాహరణకు : ‘ఎ’ అనే వ్యక్తి భారతదేశ పౌరుడు. అతను విదేశంలో ఒక హత్య చేశాడు. అలాంటి వ్యక్తిని భారతదేశంలో ఎక్కడైనా పట్టుకొని, విచారించి, శిక్ష విధించవచ్చు.

(6) ఈ చట్టం ఎవరి మీద ప్రభావం చూపదంటే  ఈ చట్టంలోని నిబంధనలు కొన్ని ప్రత్యేక వ్యక్తులకు వర్తించవు, తిరుగుబాటు చేసే అధికారులు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సిబ్బంది, భారత ప్రభుత్వ సేవలో ఉన్న సైనికులు లేదా ఇతర ఉద్యోగులు ఈ వ్యక్తులకు ప్రత్యేక చట్టాలు లేదా స్థానిక నిబంధనలు వర్తిస్తాయి, ఈ చట్టం వీరికి వర్తించదు .

————————————————–

📺 ఈ సెక్షన్ పూర్తి వీడియో వివరణ (Telugu Digi9):

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source): • Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

————————————————–