BNS సెక్షన్ 14: ఒక వ్యక్తి చట్టబద్ధంగా తన విధిని నిర్వహిస్తూ, పొరపాటున చేసిన పని నేరమ కాదా.
BNS సెక్షన్ 14: చట్టబద్ధంగా లేదా పొరపాటుగా జరిగిన పనుల చట్టబద్ధత: ఒక వ్యక్తి తన విధులను నిర్వహించే సమయంలో లేదా అనుకోకుండా పొరపాటు చేసినప్పుడు, తాను చేసిన పని చట్టబద్ధమైనదేనని నమ్మి చేశాడా లేదా అన్నదే ముఖ్యమైన విషయం, ఒక వ్యక్తి తన మంచి విశ్వాసంతో తన పని చట్టబద్ధమైనదే అనుకొని చేస్తే, అది నేరంగా పరిగణించరు, ఎవరైనా పొరపాటున నేరానికి పాల్పడ్డా, కానీ దానిని చట్టబద్ధమైనదే అని నమ్మి చేసి ఉంటే, అది నేరంగా గుర్తించబడదు.
ఉదాహరణలు: ఒక పోలీస్ అధికారి, కోర్టు ఉత్తర్వుల ప్రకారం తప్పుగా అనుమానించిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే, కానీ అతడు నిజానికి నేరస్తుడు కాకపోతే ఆ పోలీస్ అధికారి చేసిన పని నేరంగా పరిగణించరు, ఎందుకంటే అతడు తన విధిని నమ్మి చేశాడు, అదే విధంగా ఒక డాక్టర్, అత్యవసర పరిస్థితుల్లో రోగిని కాపాడేందుకు చికిత్స అందించేటప్పుడు, తప్పుగా ఏదైనా మందు ఇచ్చినట్లయితే, కానీ అతనికి తను సరిగానే చేశానన్న నమ్మకం ఉంటే, అది నేరంగా పరిగణించబడదు. ఈ సెక్షన్-14 ప్రకారం, ఎవరైనా తన మంచి విశ్వాసంతో, చట్టాన్ని పాటిస్తున్నానని నమ్మి ఏదైనా తప్పు చేశారంటే, ఆ పని నేరంగా పరిగణించబడదు. అయితే, ఆ నమ్మకానికి నిజమైన ఆధారాలు ఉండాలి అంటే చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా అర్థం చేసుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
————————————————–
📺 ఈ సెక్షన్ పూర్తి వీడియో వివరణ (Telugu Digi9):
🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):
• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)
• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062
⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):
• ఈ వెబ్సైట్లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.
• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.
✍️ సూచనలు & సవరణలు (Feedback):
• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.
————————————————–