BNS సెక్షన్ 23 : ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా మత్తు ఇచ్చి, ఆ మత్తులో అతను ఏదైనా తప్పు చేస్తే అది నేరం కాదు.
BNS సెక్షన్-23: బలవంతంగా మత్తులోకి దింపబడిన వ్యక్తి చేసే పనులు ఒక వ్యక్తిని తన అంగీకారం లేకుండా మత్తులోకి తేవడం వల్ల, ఆయన చేసే పనులు నేరమా కాదా అన్నది ప్రత్యేకంగా పరిశీలించాల్సిన విషయం. ఒక వ్యక్తి తన స్వంత నిర్ణయంతో మత్తు పదార్థాలు తీసుకుని, అప్పటి పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతే, ఆయన చేసిన తప్పులను చట్టం క్షమించదు, కానీ ఆ వ్యక్తి తన ఇష్టానికి వ్యతిరేకంగా, అంటే ఎవరైనా బలవంతంగా, మత్తులోకి నెట్టివేస్తే,అతను చేయబోయే పనులపై పూర్తి అవగాహన లేకుండా ఉంటే, చట్టపరంగా ఆ పనులను నేరంగా పరిగణించకూడదు. అలాంటి సందర్భాల్లో, ఆయన నిజంగా మత్తులో ఉన్నారా? ఆ పరిస్థితి అతనికి బలవంతంగా తెచ్చిందా? అనే అంశాలను పరిశీలించాలి. ఈ BNS సెక్షన్ ప్రకారం, ఒక వ్యక్తి తన అంగీకారం లేకుండా మత్తులోకి దింపబడి, తాను చేయబోయే పనులను అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే, ఆయన చేసిన పనులను నేరంగా పరిగణించకూడదు. కానీ, తాను స్వచ్ఛందంగా మత్తులోకి వెళ్లి చేసిన తప్పులకు మాత్రం అతను బాధ్యత వహించాల్సిందే.
————————————————–
📺 ఈ సెక్షన్ పూర్తి వీడియో వివరణ (Telugu Digi9):
🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):
• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)
• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062
⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):
• ఈ వెబ్సైట్లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.
• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.
✍️ సూచనలు & సవరణలు (Feedback):
• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.
————————————————–