BNS సెక్షన్ 36

BNS సెక్షన్ 36 ప్రకారం, మానసిక అస్థిరత లేదా అవగాహన లేని వ్యక్తి చేసే చర్యలకు వ్యతిరేకంగా వ్యక్తిగత రక్షణ హక్కు ఎలా వర్తిస్తుందో తెలుసుకోండి. Know how the right of private defence applies against acts of a person of unsound mind or lacking awareness under BNS Section 36.

BNS సెక్షన్ 36: పిచ్చివాళ్లు లేదా అవగాహన లేని వారు దాడి చేసినప్పుడు కూడా మనల్ని మనం కాపాడుకునే హక్కు ఉంటుంది.

BNS సెక్షన్-36 ప్రకారం,మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి యొక్కస్వయంరక్షణ హక్కు: ఒక వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నా, లేదా మత్తులో ఉండి, తన పని వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో అర్థం కాకుండా చేసుకుంటే, ఆయనకి స్వయంరక్షణ హక్కు వర్తించుతుంది.అంటే, ఆ పని అసలు నేరమే అయినా, ఆయన మానసిక స్థితి దెబ్బతిన్నందున, లేదా అవగాహన లేకపోవడం వల్ల, ఆ నేరానికి పూర్తిగా బాధ్యుడిగా చూడకుండా, చట్టం కొంత సడలింపు ఇస్తుంది.ప్రతి మనిషికి తన్ను తాను కాపాడుకునే హక్కు ఉన్నట్టు, ఈ తరహా సందర్భాల్లోనూ ఆ వ్యక్తి స్థితిగతులను బట్టి నిర్ణయం తీసుకుంటారు.
ఉదాహరణకు : (ఎ) జెడ్ అనే మనిషి మానసికంగా సరిగాలేకపోయి ఎ అనే వ్యక్తిని చంపేసినప్పుడు, చట్టం జెడ్ను నేరస్థుడిగా పరిగణించదు. ఎందుకంటే జెడ్కి తాను చేసిన పని ఏంటో, దాని ఫలితమేంటో అర్థం కాని స్థితిలో ఉన్నాడు. అయితే, ఎకు మాత్రం తన్ను తాను రక్షించుకునే హక్కు ఉంటుంది. అదే విధంగా, జెడ్ కూడా తాను మానసికంగా అస్థిరంగా కాకుండా, సరైన తెలివితేటలు ఉన్న వ్యక్తి అయితే మాత్రం, ఆ హక్కు అతనికి వర్తించదు.
(బి) ఎ అనే వ్యక్తికి చట్టబద్ధంగా ఒక ఇంట్లోకి వెళ్లే హక్కు ఉంది. కానీ రాత్రిపూట ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, జెడ్ అనే వ్యక్తి, ఎను కావాలని ఒక తలుపులు పగలగొట్టే వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాడు, అంటే ఎ మీద దాడి చేయించడానికి ప్రయత్నించాడు. ఇక్కడ జెడ్, ఎ మీద దురుద్దేశంతో దాడి చేయించాడని, చట్టం అతన్ని తప్పుగా పరిగణిస్తుంది.

.

————————————————–

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *