BNS సెక్షన్ 46

BNS సెక్షన్ 46 ప్రకారం, నేరాన్ని స్వయంగా చేయకపోయినా ప్రేరేపించడం, సహాయం చేయడం లేదా నేరం జరిగేలా చేయడం ద్వారా ప్రేరకుడిగా ఎలా బాధ్యత వహించాలో తెలుసుకోండి. Know who is considered an abettor and how liability arises for instigating or assisting an offence under BNS Section 46.

BNS సెక్షన్ 46 : నేరం చేయమని పురికొల్పే లేదా ప్రోత్సహించే వ్యక్తి.

BNS సెక్షన్ 46 ప్రకారం, ఒక వ్యక్తి తాను నేరం చేయకపోయినా కానీ, ఆ నేరం జరిగేలా ప్రేరేపించాడా? ప్రోత్సహించాడా? సహాయపడ్డాడా? అన్నదాన్ని కూడా నేరంగా పరిగణిస్తారు.ఇది ఏ సందర్భాల్లో వర్తిస్తుంది? ముఖ్యంగా చెప్పాలంటే, మీరు నేరం చేయకపోయినా, నేరం జరిగేలా ప్రోత్సహించినా, సహాయం చేసినా, ప్లాన్ చేసినా అది కూడా చట్టపరంగా నేరమే. నేరం చేయించే వారిని కూడా నేరస్తులుగానే పరిగణిస్తారు!
వివరణ 1: ఒక వ్యక్తి చేసిన చట్టవిరుద్ధమైన పని (తప్పు/నేరం), వేరొకరు ప్రేరేపించిన కారణంగా జరిగి ఉండవచ్చు. అయితే, ఆ నేరం చేయడానికి ప్రేరేపించిన వ్యక్తి ఆ తప్పును తానే తప్పనిసరిగా చేయాల్సిన అవసరం లేదు.
వివరణ 2: ప్రేరేపించిన వ్యక్తి చేసిన ప్రేరేపణ (సూచన, ప్రేరణ) వల్ల నేరం జరిగినా, జరగకపోయినా, ఆ ప్రేరేపణను కూడా నేరంగా పరిగణిస్తారు.
ఉదాహరణలు
(ఎ) హత్యకు ప్రేరేపించడం ఎ అనే వ్యక్తి, బి అనే వ్యక్తితో  సి అనే వ్యక్తిని చంపమని ప్రేరేపించాడు, అయితే, బి హత్య చేయడానికి అంగీకరించలేదు, ఇక్కడ బి హత్య చేయకపోయినా, ఎ ప్రేరేపించడం నేరమే.
(బి) ప్రేరేపణ వల్ల మరొకరు హత్య చేయడం ఎ అనే వ్యక్తి, బి అనే వ్యక్తితో  డి అనే వ్యక్తిని చంపమని ప్రేరేపించాడు,అయితే, చివరికి బి అనే వ్యక్తి డి ని చంపాడు, ఇక్కడ ఎ ప్రేరేపించినప్పటికీ హత్యను బి చేశాడు, కానీ ప్రేరేపించిన ఎ కూడా నేరానికి బాధ్యుడవుతాడు.
3 : ప్రేరేపణకు సంబంధించిన వివరణ నేర ప్రేరేపణ చేసే వ్యక్తి తప్పనిసరిగా ఆ నేరాన్ని చేయాల్సిన అవసరం లేదు, అతను నేరం జరగాలని ఉద్దేశపూర్వకంగా అనకపోయినా, లేదా చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా, అతని ప్రేరేపణ నేరమే అవుతుంది.
ఉదాహరణలు:
(ఎ) ఒక పిల్లవాడిని లేదా మనస్థిమితం లేని వ్యక్తిని నేరపూరితమైన పని చేయమని ఎ అనే వ్యక్తి ప్రేరేపిస్తే, ఆ పని చట్టప్రకారం నేరమే అవుతుంది. ఆ పని చేసిన వ్యక్తికి నేరపూరిత ఉద్దేశం ఉన్నా లేకపోయినా, ప్రేరేపించిన వ్యక్తి కూడా నేరానికి బాధ్యుడవుతాడు.
(బి) జెడ్ అమ వ్యక్తిని హత్య చేయించుటకు బి అను 7 సంవత్సరములలోపు వయస్సుగల వానిని ఎ ప్రేరేపించగా ఆ చర్యవలన జడ్ అను వ్యక్తి మరణించెను. ఆ ప్రేరేపణ పర్యవసానంగా బి అను వ్యక్తి జడ్ అనువాని మరణానికి ఎ పరోక్షంగా వున్న సమయంలో జరిగినది. ఇక్కడ బి అను వ్యక్తి చట్టపరంగా సమర్థుడు కాకపోయినా నేరము జరిగినది. బి అనువాడు చట్టపరంగా సమర్థుడైనచో జరిగే విధానమే ఎ అనువానికి వర్తించును. చివరగా ఆతడు హత్యను చేసినందున ఆతడు హత్యకు చెందిన శిక్షను అనుభవించవలసి వుంటుంది.
(సి) ఎ అనే వ్యక్తి, బి అనే వ్యక్తిని ఒక ఇంటిని తగలబెట్టమని ప్రేరేపించాడు. అయితే, బి కు సరైన మనస్తత్వం లేకపోవడంతో, తన చర్యల ఫలితాలు ఏమిటో, అవి మంచివా చెడ్డవా అనే విషయాలు అర్థం కాకుండా, అలాగే అది చట్టవిరుద్ధమని తెలియకుండానే ఇంటిని తగలబెట్టాడు. అయినప్పటికీ, ఎ ఇంటిని తగులబెట్టమని చెప్పడం ద్వారా నేరానికి ప్రేరేపించినందున, అతడిని చట్టప్రకారం శిక్షించవచ్చు.
(డి) జెడ్ అనే వ్యక్తి ఆస్తిని ఎ అనేవాడు బి అనే వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించి స్వాధీనం చేసుకోవాలని చెప్పాడు. బి కి ఆ ఆస్తి తనదే అని చెప్పి ఎ ఒత్తిడి చేసి, అలా నమ్మించి ఆ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు. బి ఈ విషయం నిజంగా గట్టి నమ్మకంతో చేసినా, అది దొంగతనం కాదు. కానీ, ఎ మాత్రం, ఆ ఆస్తిని దొంగతనం చేయమని బిని ప్రేరేపించి దొంగతనం చేయించాడని, దాంతో అతడు కూడా దొంగతనం చేసే నేరానికి బాధ్యుడై శిక్షను అనుభవించవలసి ఉంటుంది.
వివరణ 4: ప్రేరేపణ ఒక నేరం కావడంతో, దాని ద్వారా జరిగిన నేరాన్ని కూడా నేరంగా పరిగణిస్తారు. అంటే, ఎవరైనా ఇంకొకరిని నేరం చేయడానికి ప్రేరేపించినా, అది కూడా నేరమే అవుతుంది.
ఉదాహరణ
జెడ్ ని హత్య చేయమని ఎ బి కి చెప్పాడు. ఆ బి మరీ సి ని చెప్పాడు. ఆ సి ప్రేరణతో జెడ్ ని హత్య చేశాడు. ఈ హత్య లో బి తో పాటు ఎ కూడా బాధ్యులైనవారు. అందుకే బి కి వచ్చిన శిక్ష, ఎ కి కూడా పడుతుంది.

వివరణ 5 :  ఒక వ్యక్తి నేరం చేసాడు అంటే, ఆ నేరం చేయమని అతడిని ప్రేరేపించిన వ్యక్తి కూడా ఆ నేరం చేసినవానితో సమానంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు:  జెడ్ అనుకున్నవాడికి విషమిచ్చేందుకు ఎ అనే వ్యక్తి బి అనే వాడితో మాట్లాడాడు. అప్పుడు, ఎ విషాన్ని ఏర్పాటు చేయడానికీ అంగీకరించాడు. తరువాత, బి సి అనే వాడితో ఈ ప్రణాళిక గురించి మాట్లాడి, మూడవ వ్యక్తి ఈ పనిని చేసుకుంటున్నట్లు ఎ పేరు లేకుండా చేసినాడు. సి విషాన్ని తీసుకొని, బి కి ఇచ్చి, దానిని వాడే ఉద్దేశ్యాన్ని వివరించాడు. చివరికి, ఎ జెడ్ కి విషం ఇచ్చి, జెడ్ మరణించాడు. ఇక్కడ, సి ప్రత్యక్షంగా కుట్ర చేయలేదు, అయినప్పటికీ, సి జెడ్ మరణంలో భాగంగా ఉన్నాడు. అందుకే, ఈ సెక్షన్ ప్రకారం, సి కి కూడా హత్యకు సంబంధించిన శిక్ష పడుతుంది.

————————————————–

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *