BNS సెక్షన్ 8

BNS Section 8 in Telugu: Amount of Fine మరియు జరిమానా చెల్లించనప్పుడు (Default of fine) విధించే అదనపు జైలు శిక్షల నిబంధనలు.

BNS సెక్షన్ 8 : జరిమానా కట్టని పక్షంలో దానికి బదులుగా అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

BNS సెక్షన్-8: జరిమానా మొత్తం మరియూ చెల్లింపు బాధ్యత అపరాధానికి విధించే జరిమానా మొత్తానికి గరిష్ట పరిమితి నిర్ణయించకపోయినా, అది అనవసరంగా ఎక్కువగా ఉండకూడదు. అంటే, ఎంత జరిమానా వేయాలో స్పష్టంగా చెప్పకపోయినా, అవసరమైనంతకన్నా అధికంగా మాత్రం విధించరాదు.
(1) జరిమానా పరిమితి: ఏదైనా సందర్భంలో కోర్టు జరిమానా మొత్తాన్ని స్పష్టంగా నిర్ణయించకపోతే, ఆ మొత్తానికి ఎలాంటి పరిమితి ఉండదు. అయితే, అత్యధికంగా ఉండకూడదు.
(2) నేరం జరిగిన ప్రతి కేసులో: (ఎ) నేరస్తునికి జరిమానా మరియు జైలుశిక్ష విధించిన సందర్భంలో,అతనికి కేవలం జరిమానా మాత్రమే విధించినా,లేక జైలుశిక్షతోపాటు జరిమానా విధించినా,
ఆ శిక్షలు కోర్టు నిర్ణయానుసారంగా ఉంటాయి.
(బి) నేరస్తునికి జైలు శిక్ష & జరిమానా లేదా కేవలం జరిమానా విధించినా, కోర్టు నిర్ణయించిన శిక్షలు చెల్లుబాటు అవుతాయి.అయితే, నిర్దేశించిన జరిమానా చెల్లించకపోతే, నేరస్తుడు కొంతకాలం జైలులో శిక్ష అనుభవించాల్సి వస్తుంది.మరో కేసులో అదికంటే ఎక్కువ జైలుశిక్ష విధించినట్లయితే, అది శిక్షల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు.
(3) ఏదైనా నేరానికి శిక్షగా కోర్టు జరిమానా విధిస్తే, దాన్ని చెల్లించలేకపోతే ఆ వ్యక్తి జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే, ఆ జైలు శిక్ష గరిష్ట శిక్ష కాలం 1/4 వంతును మించకూడదు. అర్థం ఏమిటంటే: కోర్టు జైలుశిక్ష + జరిమానా విధించినప్పుడు,జరిమానా చెల్లించలేకపోతే అతను కొంత కాలం జైలులో ఉండాల్సివస్తుంది, కానీ ఆ కాలం గరిష్ట శిక్షలో నాలుగో వంతు కంటే ఎక్కువ కాకూడదు.
(4) కోర్టు విధించిన జరిమానా చెల్లించకపోతే లేదా సమాజ సేవ చేయకపోతే, కోర్టు నిర్ణయం ప్రకారం ఆ నేరస్తుడికి తగిన శిక్ష విధించబడుతుంది.
(5) జరిమానా చెల్లించడంలో విఫలమైనా లేదా కోర్టు సూచించిన సమాజ సేవను పూర్తి చేయకపోయినా, కోర్టు ఆ వ్యక్తికి జైలు శిక్ష విధించవచ్చు.
(ఎ) రూ. 5,000 వరకు జరిమానా ఉంటే, గరిష్టంగా 2 నెలల జైలు శిక్ష ఉండవచ్చు.
(బి) రూ. 10,000 వరకు జరిమానా ఉంటే, గరిష్టంగా 4 నెలల జైలు శిక్ష ఉండవచ్చు.
(సి) ఇతర కేసులలో, గరిష్టంగా ఒక సంవత్సరానికి మించి జైలు శిక్ష ఉండకూడదు.
(6) (ఎ) జరిమానా చెల్లించలేకపోయినందుకు విధించిన జైలు శిక్ష, జరిమానా మొత్తం చెల్లించిన తర్వాత లేదా చట్టం అనుసరించి చెల్లింపు పూర్తయిన తర్వాత రద్దు చేయబడుతుంది.
(బి) జైలు శిక్ష పూర్తయ్యే ముందు కొంత మొత్తం జరిమానా చెల్లించినట్లయితే, ఆ మేరకు శిక్షను తగ్గించవచ్చు.
ఉదాహరణకు, ఎ అనే వ్యక్తికి రూ. 1000 జరిమానా విధించారు, ఆయన జరిమానా చెల్లించకపోతే, 4 నెలలు జైలు శిక్ష అనుభవించాలి.అతను రూ. 750 చెల్లించినట్లయితే లేదా మొదటి నెల జైలు శిక్ష పూర్తయిన తర్వాత, ఆయనను విడుదల చేయాలి, రూ. 500 మాత్రమే చెల్లించినట్లయితే లేదా రెండు నెలల జైలు శిక్ష పూర్తయిన తర్వాత, ఆయనను విడుదల చేయాలి, జరిమానా మొత్తం లేదా మిగిలిన శిక్ష కాలం ముగిసిన వెంటనే, ఎ వ్యక్తిని తక్షణమే విడుదల చేయాలి.
(7) నేరస్తుడు జరిమానా మొత్తాన్ని లేదా దాని కొన్ని భాగాలను 6 సంవత్సరాల లోపు చెల్లించకపోతే, అతనికి 6 సంవత్సరాలు మించే శిక్ష విధించవచ్చు, అయితే, ఆ 6 సంవత్సరాల కాలానికి ముందు నేరస్తుడు మరణిస్తే, అతనిపై ఉన్న బాధ్యతలు రద్దు అయినట్టే. కానీ, ఆయన మరణించిన తర్వాత కూడా, అతని అప్పుల భారం కుటుంబ సభ్యులపై కొనసాగవచ్చు.

————————————————–

📺 ఈ సెక్షన్ పూర్తి వీడియో వివరణ (Telugu Digi9):

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *