BNS సెక్షన్18. సంక్షిప్త పేరు, పరిధి మరియు అమలు
(1) ఈ చట్టాన్ని ‘భారతీయ న్యాయ సంహిత, 2023’ అని పిలుస్తారు.
(2) కేంద్ర ప్రభుత్వం గెజెట్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ఈ న్యాయ సంహితలో ఉన్న వివిధ నిబంధనలు వేర్వేరు తేదీల్లో అమల్లోకి వస్తాయి. ఆ నియమించిన తేదీ నుంచే అవి లాగు అవుతాయి.
(3) భారతదేశ పరిధిలో ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు నడుచుకున్నా, అటువంటి వ్యక్తి నేరస్తుడిగా పరిగణించబడతాడు. ఈ నిబంధనల ప్రకారం అతనికి తగిన శిక్ష విధించబడుతుంది.
(4) అప్పటికప్పుడు భారతదేశంలో అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఎవరైనా నేరం చేస్తే, ఈ న్యాయ సంహితలోని నిబంధనల ప్రకారం శిక్షలు అమలవుతాయి.
(5) ఈ న్యాయ సంహితలో ఉన్న నిబంధనలు ఈ క్రింది సందర్భాల్లో కూడా వర్తిస్తాయి:
- (ఎ) భారతదేశ పౌరుడు ఎక్కడైనా నేరం చేసినా, దేశంలో లేదా దేశం బయటైనా;
- (బి) భారతదేశంలో రిజిస్టర్ అయిన ఓడ లేదా విమానం, అవి ఎక్కడ ఉన్నా;
- (సి) దేశంలో లేదా విదేశంలో ఉంటూ, భారతదేశంలోని ఏదైనా కంప్యూటర్ వ్యవస్థ ద్వారా నేరం చేసినా.”
ఉదాహరణకు : ‘ఎ’ అనే వ్యక్తి భారతదేశ పౌరుడు. అతను విదేశంలో ఒక హత్య చేశాడు. అలాంటి వ్యక్తిని భారతదేశంలో ఎక్కడైనా పట్టుకొని, విచారించి, శిక్ష విధించవచ్చు.
(6) ఈ చట్టం ఎవరి మీద ప్రభావం చూపదంటే ఈ చట్టంలోని నిబంధనలు కొన్ని ప్రత్యేక వ్యక్తులకు వర్తించవు, తిరుగుబాటు చేసే అధికారులు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సిబ్బంది, భారత ప్రభుత్వ సేవలో ఉన్న సైనికులు లేదా ఇతర ఉద్యోగులు ఈ వ్యక్తులకు ప్రత్యేక చట్టాలు లేదా స్థానిక నిబంధనలు వర్తిస్తాయి, ఈ చట్టం వీరికి వర్తించదు .
————————————————–
📺 ఈ సెక్షన్ పూర్తి వీడియో వివరణ (Telugu Digi9):
🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):
• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)
• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062
⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):
• ఈ వెబ్సైట్లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.
• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.
✍️ సూచనలు & సవరణలు (Feedback):
• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.
————————————————–