BNS సెక్షన్ 26

BNS Section 26 explained in Telugu: మరణం కలిగించే ఉద్దేశం లేకుండా, ఒకరి మేలు కోసం మంచి విశ్వాసంతో (Good Faith) మరియు అంగీకారంతో (Consent) చేసే పనులకు లభించే చట్టపరమైన రక్షణ మరియు పూర్తి వివరాలు.

BNS సెక్షన్ 26 : ఒక వ్యక్తి మేలు కోసం, అతని అనుమతితో, చెడ్డ ఉద్దేశం లేకుండా చేసే పని (ఉదా: డాక్టర్ చేసే సర్జరీ).

BNS సెక్షన్-26: మంచి ఉద్దేశంతో చేసేవి నేరం కాదు : ఒక పని మరణానికి ఉద్దేశించి లేకుండా, ఎవరైనా మంచి విశ్వాసంతో, ఆ పని వల్ల ఎవరికైనా మేలు జరుగుతుందని నమ్మి చేస్తే, అది నేరంగా పరిగణించరు. అలాగే, దానివల్ల ఎవరికైనా నష్టం కలగదనో, దీన్ని చేస్తున్న వ్యక్తికి ఎలాంటి చెడు ఉద్దేశం లేదనో, లేదా దీన్ని అంగీకరించిన వ్యక్తికి మేలవుతుందనో నమ్మకం ఉంటే, అదే పనిని అంగీకరించినవాళ్లపై నేరారోపణ ఉండదు.సాధారణంగా, మంచి విశ్వాసంతో, ఎవరికైనా లాభం కలిగించాలనే ఉద్దేశంతో జరిగే పనులను నేరంగా చూడరు. ఈ సెక్షన్ ప్రకారం, ఒక వ్యక్తి చిత్తశుద్ధిగా, మంచి విశ్వాసంతో, ఎవరైనా ఒప్పుకుని, వారి మంచికోసం ఏదైనా పని చేస్తే, అది నేరంగా పరిగణించరు,అలాగే, ఆ పని చేసే ఉద్దేశ్యం ఎవరినైనా గాయపరచడం లేదా మరణానికి కారణం కావడం కాకుండా ఉంటే, దాన్ని నేరంగా చూడరు, సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా మంచికే చేస్తున్నపుడు, కష్టంగా మారినా, తప్పుగా చూడరు.
ఉదాహరణకు : శేఖర్ అనే వైద్యుడికి సతీష్ అనే వ్యక్తికీ ఓ స్పెషల్ సర్జరీ చేస్తే, అతని ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చని ముందే తెలుసు. కానీ, సతీష్ తీవ్రమైన బాధతో ఉన్నాడు, అందుకే ఆపరేషన్ వల్ల అతనికి మేలు జరుగుతుందనే మంచి ఉద్దేశంతో, సతీష్ కూడా ఒప్పుకోవడంతో, శేఖర్ ఆపరేషన్ చేశాడు, ఈ పరిస్థితిలో శేఖర్ అనేవ్యక్తి  సతీష్ ను చంపాలని ఉద్దేశించి చేసిందికాదు, కేవలం అతనికి మంచి జరుగాలని, మంచి విశ్వాసంతో చేశాడు. అందుకని శేఖర్ ఏ నేరం చేసినట్టు పరిగణించరు.

————————————————–

📺 ఈ సెక్షన్ పూర్తి వీడియో వివరణ (Telugu Digi9):

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *