BNS సెక్షన్ 27

BNS సెక్షన్ 53 ప్రకారం, ప్రేరేపించిన నేరం వల్ల ఆశించిన దానికంటే భిన్నమైన పరిణామాలు జరిగినప్పుడు ప్రేరకుడి బాధ్యత ఏమిటో తెలుసుకోండి. Know the liability of an abettor under BNS Section 53 when the consequences differ from those intended.

BNS సెక్షన్ 27 : పిల్లలు లేదా మానసిక రోగుల మేలు కోసం వారి గార్డియన్ అనుమతితో చేసే పనులు.

BNS సెక్షన్-27 – పిల్లల మంచికోసం లేదా మానసికంగా బలహీనమైనవాళ్ల కోసం, వారి సంరక్షకుడి అనుమతితో చేసే పనులు. 12 ఏళ్లలోపు పిల్లల మంచికోసం, లేదా మానసికంగా బలహీనమైన వ్యక్తుల ప్రయోజనానికి, వాళ్లకు తెలిసినా తెలియకపోయినా, వారి సంరక్షకుడు లేదా చట్టబద్ధమైన వ్యక్తి అనుమతితో, మంచి ఉద్దేశంతో, మంచి విశ్వాసంతో ఏదైనా చర్య తీసుకుంటే, అద్వారా జరిగే నష్టాన్ని నేరంగా పరిగణించరు.సింపుల్గా చెప్పాలంటే, పిల్లలు లేదా మానసిక స్థితి బాగోలేని వాళ్ల కోసం, వారి సంరక్షకుల అనుమతితో మంచి ఉద్దేశంతో చేసే పనులు, తక్కువ నష్టం జరిగినా నేరంగా పరిగణించరు. అయితే ఇక్కడ చెప్పిన పరిస్థితులకు ఈ మినహాయింపులు వర్తించవు:
(ఎ) ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణమవ్వడం లేదా ఆత్మహత్యకు ప్రేరేపించడానికి ప్రయత్నించడం.
(బి) ఏదైనా పని వల్ల మరణం జరగొచ్చని తెలిసినా, అది మానుకోకుండా చేయడం తప్పు. అయితే, ఒకవేళ ఆ పని తీవ్రమైన గాయాలకు చికిత్స చేయడానికి, అంగవైకల్యాన్ని తగ్గించడానికి, లేదా ప్రాణాలు కాపాడే ఉద్దేశ్యంతో చేస్తే, అది నేరంగా పరిగణించరు.
(సి) తీవ్రమైన గాయాలు కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినా, లేదా అలా చేయడానికి ప్రయత్నించినా, దీనికి మినహాయింపు వర్తించదు. కానీ, ఆ గాయాలకు చికిత్స చేయడం, ప్రాణాలు కాపాడడం, లేదా అంగవైకల్యాన్ని తగ్గించడానికి తీసుకునే చర్యలు నేరం కింద రావు.
(డి) ఏదైనా నేరాన్ని ప్రేరేపించడం లేదా దానికి సహాయం చేయడం ఈ మినహాయింపుల్లోకి రాదు.
ఈ సెక్షన్ ప్రకారం, పిల్లవాడి ప్రాణాలు కాపాడటానికి లేదా మానసిక స్థితి బాగోలేని వ్యక్తికి సహాయంగా, వారి సంరక్షకుల అనుమతితో మంచి ఉద్దేశంతో సేవ చేయొచ్చు.
ఉదాహరణకు : రవిందర్ అనే వ్యక్తి మంచి ఉద్దేశంతో ఒక పిల్లవాడికి, అతని అనుమతి లేకపోయినా, ఆ పిల్లవాడికి మేలు జరుగుతుందని నమ్మి సహాయం చేశాడు. ఆ పిల్లవాడు రాతి దెబ్బలు తగిలి గాయపడి బాధపడుతుంటే, అతని ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో చికిత్స చేశాడు. అయితే, ఈ చికిత్స వల్ల పిల్లవానికి ప్రమాదం ఏర్పడొచ్చని తెలిసినా, రవిందర్ కి పిల్లవాడు చనిపోవాలనే ఉద్దేశం లేదు. రవిందర్ కు ఉన్న ఉద్దేశం పిల్లవాడిని రక్షించడమే, అందుకే ఇది నేరంగా పరిగణించరు, మినహాయింపుగా చూస్తారు.

————————————————–

📺 ఈ సెక్షన్ పూర్తి వీడియో వివరణ (Telugu Digi9):

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *