BNS సెక్షన్ 29 : వ్యక్తిగత హాని కలిగించే చర్యలకు మినహాయిపుల పరిమితి
BNS సెక్షన్-29: వ్యక్తిగతంగా హాని కలిగించే నేరాల మినహాయింపు ఇప్పటి వరకూ సెక్షన్ 25, 26, 27లలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అంటే, మనం వ్యక్తిగతంగా చేసుకునే కొన్ని పనులకు చట్టం నుంచి కొంత సడలింపు ఉండేది. కానీ, ఆ పనులు ఎవరికైనా హాని కలిగించేలా ఉంటే, లేదా అలా చేయడానికి కారణంగా మారితే, అప్పుడు ఆ మినహాయింపులు వర్తించవు. అంటే, ఒకరు ఇంకొకరికి నష్టం కలిగించేలా ఏదైనా చేస్తే, లేదా అలా చేయడానికి కారణమైతే, “ఆ వ్యక్తి అంగీకరించాడు” అని చెప్పి తప్పించుకోలేరు. అదేవిధంగా, ఎవరి తరఫునైనా అంగీకారం ఇచ్చినా, అది చట్టబద్ధంగా మినహాయింపు పొందదని సెక్షన్ 29 స్పష్టంగా చెబుతుంది, సాధారణంగా, మనకు ఉన్న కొన్ని స్వేచ్ఛల వల్ల, కొన్ని పనులు చట్టబద్ధంగా తప్పించుకోవచ్చు. కానీ, ఆ పనులు మరొకరికి హాని కలిగిస్తే, అప్పుడు ఆ స్వేచ్ఛ వర్తించదు. అంటే, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో ఎవరికైనా నష్టం కలిగించే పనులు చేస్తే, అది మినహాయింపు కింద రాదని ఈ సెక్షన్ చెబుతుంది.
ఉదాహరణకు
ఎవరైనా గర్భస్రావానికి కారణమై, వాళ్ల చర్యల వల్ల ఎవరికైనా హాని జరిగితే, అది నేరంగా పరిగణించబడుతుంది. అయితే, ఒక విషయంలో మాత్రం మినహాయింపు ఉంది – అదేంటంటే, ఒక స్త్రీ ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు, ఆమెను కాపాడటానికి మంచి నమ్మకంతో తీసుకున్న చర్య అయితే, అది నేరంగా పరిగణించరు. కానీ, గర్భస్రావం జరిగేలా చేయడానికి ఏమైనా ఉద్దేశపూర్వకంగా చర్య తీసుకుంటే, లేదా ఆ చర్య వల్ల ఓ స్త్రీకి హాని కలుగుతుందని తెలిసినా ఆ పని చేస్తే, అది నేరంగా లెక్కిస్తారు. అలాగే, ఆ పని చేయడానికి ఓ వ్యక్తి అంగీకారం తెలిపినా, లేదా అతడి తరఫున ఇంకెవరైనా అంగీకరించినా, ఆ చర్య చట్టబద్ధంగా తప్పించుకోదు. అంటే, స్త్రీ ప్రాణాన్ని కాపాడడం తప్ప, ఎవరైనా గర్భస్రావానికి కారణమైతే, లేదా అలా చేయడానికి సహకరించినా, అది నేరంగా పరిగణించబడుతుందని ఈ నియమం చెబుతోంది
————————————————–
🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):
• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)
• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062
⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):
• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.
• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.
✍️ సూచనలు & సవరణలు (Feedback):
• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.
————————————————–