BNS సెక్షన్ 40

BNS సెక్షన్ 40 ప్రకారం, శరీరానికి ప్రమాదం ఏర్పడే భయం మొదలైనప్పటి నుంచి ఆ ప్రమాదం కొనసాగుతున్నంత వరకు ప్రైవేట్ రక్షణ హక్కు ఎప్పుడు ప్రారంభమై, ఎంతకాలం కొనసాగుతుందో తెలుసుకోండి. Know when the right of private defence of the body commences and continues under BNS Section 40.

BNS సెక్షన్ 40 : దాడి జరిగే ముప్పు మొదలైనప్పటి నుండి ఆ ప్రమాదం పోయే వరకు ఆత్మరక్షణ హక్కు ఉంటుంది.

BNS సెక్షన్-40 : ప్రకారం శరీర రక్షణ హక్కు ప్రారంభం మరియు కొనసాగింపు: ఈ సెక్షన్ లో చెప్తున్నది, మీ శరీరం మీద ఎలాంటి ప్రమాదం జరిగినా లేదా వచ్చే అవకాశం ఉన్నా, ఆ ప్రమాదాన్ని మీరు నివారించడానికి తీసుకున్న చర్యలు చట్టపరంగా నేరంగా పరిగణించబడవు, మీ శరీరానికి ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని మీరు అనుకున్నా, మీరు ఆ ప్రమాదం నుంచి రక్షణ పొందే క్రమంలో తీసుకునే చర్యలు చట్టపరంగా సరైనవే. మీకు కొంతమేర భయం లేదా అనుమానం కలిగితే, ఎటువంటి నేరం జరుగుతుందో లేదో అన్న విషయం పక్కన పెడితే, అది మీరు భయపడినంత కాలం వరకూ చట్టం క్రింద రక్షణగా పరిగణించబడుతుంది, మీరు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి తీసుకునే చర్యలు చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడవు. ప్రమాదం నుంచి రక్షణ పొందే క్రమంలో భయంగా ఉన్నా, ఆ భయం కొనసాగినంత కాలం మీ చర్యలు చట్టపరంగా సమర్థించబడతాయి.

.————————————————–

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *