BNS సెక్షన్ 45

BNS సెక్షన్ 45 ప్రకారం, నేరానికి ప్రేరేపించడం, కుట్రలో భాగస్వామ్యం కావడం లేదా ఉద్దేశపూర్వకంగా సహకరించడం వంటి చర్యలు నేర ప్రేరేపణగా ఎలా పరిగణించబడతాయో తెలుసుకోండి. Know how instigation, conspiracy and intentional assistance can constitute abetment under BNS Section 45.

BNS సెక్షన్ 45 : ఒక నేరం జరగడానికి వేరొకరిని ఉసిగొల్పడం లేదా ప్రేరేపించడం.

BNS SECTION-45 లో చెప్పిన విషయానికి అనుగుణంగా, ఒక వ్యక్తి నేర ప్రేరేపణ చేయడం అనగా, ఎవరో ఒకరినో లేదా కొంతమందిని నేరం చేయడానికి  ప్రేరేపించడం, రెచ్చగొట్టడం లేదా కుట్ర చేయడం, ఈ సెక్షన్ ప్రకారం, నేరం చేయడానికి ఎవరు ప్రేరేపిస్తే, వాళ్ళు కూడా నేరం చేయడంలో భాగం అయిపోతారు. ఇది కింది విధంగా విస్తరించబడింది:
(ఎ) ప్రేరేపించుట: ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఏదైనా పని చేయమని రెచ్చగొట్టడం లేదా ప్రేరేపించడం అంటే, అది నేరం చేయడంలో అతనికి సహకరించడం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇద్దరు మనుషులను ఒకరిపై దాడి చేయమని ప్రేరేపించటం.
(బి) కుట్రకు సిద్ధపడటం: ఒక వ్యక్తి కుట్ర చేయడానికి ప్రేరేపించడం, అంటే, పలు వ్యక్తులతో కలిసి ఏదైనా నేరం చేయడానికి ఒప్పుకుంటూ యోచన చేసి ముందుకెళ్లడం. ఇక్కడ, ఆ ప్రేరేపణ లేదా కుట్ర చేసి, అవసరమైన చర్యలు తీసుకోవడం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇంటిలో దొంగతనం చేయడానికి మరొక వ్యక్తిని ప్రేరేపించటం.
(సి) చట్టవిరుద్ధంగా సహకరించడం: ఒక వ్యక్తి ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యను చేయడానికి సహకరించడం లేదా పాలుపడటం అంటే, కొన్ని తప్పులలో మానసికంగా సహకరించడం. ఉదాహరణకి, ఒక వ్యక్తి దోపిడి చేసే వ్యక్తికి సహాయం చేస్తూ, అతనికి గమనించకుండా వెళ్లడానికి మార్గం చూపించడం.
వివరణ 1: ఒక వ్యక్తి తన ఉద్దేశంతో తెలుసుకోవాల్సిన లేదా చెప్పాల్సిన సత్యాన్ని తప్పుగా చెప్పడం లేదా దాచిపెట్టడం చట్టపరంగా తప్పు. అలాగే, ఏదైనా వస్తువును స్వాధీనం చేసుకుని లేదా చేయాల్సిన పనిని చేయకుండా ఉండిపోవడం కూడా తప్పే.ఒక వ్యక్తి నిజం తెలియజేయకుండా తప్పుగా చెప్పినా, దాచిపెట్టినా, లేదా చేయాల్సిన పనిని కావాలనే మానివేసినా, అది చట్టపరంగా తప్పు.
వివరణ 2:  ఒక వ్యక్తి ఏదైనా పని జరగడానికి ముందు లేదా తర్వాత, అదే పనిని జరుగటానికి ఏదైనా సహాయం అందిస్తే, లేదా అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నా, అది ఆ పనికి సహకరించిందిగా పరిగణిస్తారు.ఒక దొంగతనానికి ముందుగా దొంగలకు వివరాలు అందించడం (ఎప్పుడు, ఎక్కడ దొంగతనం చేయాలో చెప్పడం).ఓ నేరస్తుడికి ఆయుధాలు ఇచ్చి, ఎక్కడ దాచుకోవాలో చెప్పడం.
ఉదాహరణ
ఒక నేరానికి సంబంధించి కోర్టు జెడ్ అనే వ్యక్తిని పట్టుకోవడానికి అధికారులకు వారెంట్ ఇచ్చింది. ఈ వారెంట్ను ఎ అనే అధికారికి పంపారు, అతడు దీనిని అమలు చేయాలి. అయితే, సి అనే వ్యక్తికి అసలు నిజం తెలుసు అంటే జెడ్ ఎవరో బాగా తెలుసు. కానీ, సి ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పి, జెడ్ స్థానంలో మరో వ్యక్తిని చూపించాడు.దీని వల్ల ఎ అనే అధికారి తప్పుడు సమాచారంతో తప్పు చేసాడు.ఈ తప్పుడు సమాచారం కారణంగా బి అనే వ్యక్తి కూడా అనుమానంలో పడిపోయాడు.ముఖ్యంగా చెప్పాలంటే :సాధారణంగా ఒక నేరానికి సంబంధించి తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు, అది ఆ నేరానికి సహకరించినట్టే. ఈ ఉదాహరణలో సి అనే వ్యక్తి ఎ అనే అధికారిని తప్పుదోవ పట్టించాడు, దీని వల్ల బి అనుమానితుడయ్యాడు.అందుకే తప్పుడు సమాచారం ఇవ్వడం కూడా నేరమే!

————————————————–

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *