BNS సెక్షన్ 48

BNS సెక్షన్ 48 ప్రకారం, విదేశాల్లో ఉన్న వ్యక్తి భారతదేశంలో నేరం జరిగేలా ప్రేరేపించినప్పుడు అతని బాధ్యత ఎలా ఉంటుందో తెలుసుకోండి. Know the liability for abetment outside India of an offence committed in India under BNS Section 48.

BNS సెక్షన్ 48 :  విదేశాల్లో ఉండి భారతదేశంలో నేరం జరగడానికి ప్లాన్ చేయడం లేదా ప్రేరేపించడం.

BNS సెక్షన్ 48: ఇండియాలో నేరం జరుగుటకు విదేశాలలో నేర ప్రేరేపణ,  ఈ సెక్షన్ ప్రకారం, ఒక నేరం విదేశాల్లో ప్రేరేపించబడినా, ఆ ప్రేరేపణ కారణంగా నేరం భారతదేశంలో జరిగితే, అది కూడా నేరంగా పరిగణించబడుతుంది. అంటే, ఒక వ్యక్తి విదేశంలో ఒక నేరం చేయమని ఇతరులకు ప్రేరేపిస్తే, ఆ ప్రేరేపణ కారణంగా నేరం భారతదేశంలో జరిగితే, ఆ నేరానికి కూడా బాధ్యులుగా పరిగణించబడతారు, విదేశాలలో ప్రేరేపణ జరిగినా, ఆ ప్రేరణతో భారతదేశంలో జరిగిన నేరం పట్ల కూడా భారతీయ చట్టాలు అమలవుతాయి.
ఉదాహరణకు : ఎక్స్ అనే దేశంలో ఒక ఎ అనే వ్యక్తి, బి అనే వ్యక్తికి హత్య చేయమని ప్రేరేపించేవాడు. ఇక్కడ, ఎ అనువాడు బి ను ఒక వ్యక్తిని హత్య చేయమని చెప్పి ప్రేరేపించాడు. అంటే, ఎ ఆ హత్యను చేయమని బి ను ప్రబావితం చేశాడు, ఈ చర్య వల్ల ఎ అనువాడు ప్రేరకుడిగా పరిగణించబడతాడు. ప్రేరకుడు అంటే, నేరాన్ని చేయించడానికి ఇతరులను ప్రేరేపించే వ్యక్తి. నేరం చేసిన వ్యక్తి బి అయితే, ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎ కూడా నేరస్తుడిగా పరిగణించబడతాడు, ఎందుకంటే అతను హత్య చేయమని చెప్పి బి ను ప్రేరేపించి ఆ నేరం జరగాలని దారి చూపించాడు.అందువల్ల, ఎ అనువాడు నేరానికి బాధ్యుడు అవుతాడు, ఇది చట్ట ప్రకారం, ప్రేరకుడు అయిన వ్యక్తి కూడా నేరానికి బాధ్యుడిగా పరిగణించబడతాడు.

————————————————–

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక / లీగల్ డిస్క్లైమర్ (Legal Disclaimer):

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *