BNS సెక్షన్ 52

BNS సెక్షన్ 52 ప్రకారం, ప్రేరేపణ వల్ల జరిగిన నేరంతో పాటు అదనపు నేరం లేదా పరిణామం జరిగినప్పుడు ప్రేరకుడి బాధ్యత మరియు శిక్ష ఎలా వర్తిస్తాయో తెలుసుకోండి. Know how the liability and punishment of an abettor apply when an additional offence or consequence occurs due to abetment under BNS Section 52.

భారతీయ న్యాయ సంహిత, 2023

BNS సెక్షన్ 52 : ప్రేరేపించినందుకు మరియు ఆ నేరం జరిగినందుకు కలిపి శిక్ష విధించడం.

BNS సెక్షన్ 52 ప్రకారం, ఒక వ్యక్తి నేరం చేయమని ప్రేరేపించాడంటే, ఆ నేరం జరిగినా లేదా అదనంగా మరొక నేరం జరిగినా, ఆ ప్రేరేపించిన వ్యక్తికి మొత్తం నేరాలపై సమగ్రంగా శిక్ష విధించబడుతుంది, ఈ సెక్షన్ BNS సెక్షన్ 51 కు అనుసంధానంగా ఉంటుంది. అంటే, ప్రేరణతో ఒక నేరం జరిగితే ఆ నేరానికి మాత్రమే కాకుండా, అదనంగా ఏమైనా జరిగితే దానికి కూడా కలిపి శిక్ష విధించబడుతుంది, సాధారణంగా, ప్రేరేపించిన వ్యక్తి “నేను ఇది మాత్రమే చెప్పాను, కానీ అది జరిగింది” అని తప్పించుకోలేడు, ఎందుకంటే, ప్రేరణ వల్ల జరిగే అన్ని పరిణామాలకు అతడు బాధ్యుడిగా పరిగణించబడతాడు.
ఉదాహరణలు
ఎ అనే వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎదుర్కొని, అతనికి హాని చేయాలని బి అనే వ్యక్తిని ప్రేరేపించాడు, దీంతో, బి ఆ ఉద్యోగిపై దాడి చేసి, అతనికి తీవ్ర గాయాలు చేశాడు, ఇక్కడ రెండు నేరాలు జరుగాయి: బి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసి గాయపరిచాడు – ఇది నేరం, ఎ, బిని ప్రేరేపించడం వల్ల ఈ ఘటన జరిగింది – ఇది కూడా నేరం, అంటే, బి స్వచ్ఛందంగా దాడి చేసినా, ఆ దాడి వెనుక ఎ ప్రేరేపణ ఉండడంతో, ఆ ఇద్దరికీ నేరానికి సమానమైన శిక్ష విధించబడుతుంది, ఇక్కడ ఎ అనుకునే “నేను దాడి చెయ్యలేదుగా!” అని తప్పించుకోలేడు. ఎందుకంటే, తన ప్రేరేపణ వల్లే బి ఆ చర్య చేశాడు, దీని వల్ల ప్రేరేపించిన వ్యక్తి కూడా పూర్తిగా నేరానికి బాధ్యుడవుతాడు.

————————————————–

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక  

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *