BNS సెక్షన్ 53

BNS సెక్షన్ 53 ప్రకారం, ప్రేరేపించిన నేరం వల్ల ఆశించిన దానికంటే భిన్నమైన లేదా తీవ్రమైన పరిణామాలు జరిగినప్పుడు ప్రేరకుడి బాధ్యత ఏమిటో తెలుసుకోండి. Know the liability of an abettor under BNS Section 53 when the consequences differ from those intended.

భారతీయ న్యాయ సంహిత, 2023

BNS సెక్షన్ 53 : ప్రేరేపించిన వ్యక్తి అనుకున్న దానికంటే భిన్నంగా నేరం జరిగినప్పుడు బాధ్యత.

సెక్షన్ BNS 53 ప్రకారం, ఒక వ్యక్తి ఎవరికైనా ఒక పనిని చేయమని ప్రేరేపిస్తే, అతను ఆశించిన దానికంటే భిన్నమైన పరిణామాలు జరిగితే కూడా, ప్రేరేపించిన వ్యక్తి (ప్రేరకుడు) దానికి బాధ్యత వహించాలి, ప్రేరేపించిన వ్యక్తి ఆశించిన దానికన్నా ఎక్కువ గాని, తక్కువ గాని, ఏదైనా జరిగితే, దానికి కూడా అతడే సమాధానం చెప్పాలి. ప్రేరణ ఇచ్చిన వాడి తప్పు కూడా నేరంగా పరిగణించబడుతుంది.
ఉదాహరణ
ఎ” అనే వ్యక్తి “బి” అనే వ్యక్తిని  ప్రేరేపించి, “జెడ్” అనే వ్యక్తిని గాయపరచమని చెప్పాడు, అయితే ఈ ప్రేరణ కారణంగా “బి” దాడి చేయడంతో, “జెడ్” కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ గాయాల వల్ల “జెడ్” చివరికి మరణించడం జరిగింది, ఇక్కడ “ఎ” ప్రేరేపించింది గాయపరిచేందుకు కానీ, దాని ఫలితంగా “జెడ్” మృతి చెందాడు. “ఎ”కి ఇది జరగొచ్చని తెలుసు, కాబట్టి “ఎ” హత్యకు బాధ్యుడుగా పరిగణించబడతాడు. అందుకే హత్య చేసినట్లు శిక్ష పడుతుంది.

————————————————–

🔗 చట్టపరమైన ఆధారాలు & రిఫరెన్స్ (Official Source):

• Central Act Reference: The Bharatiya Nyaya Sanhita, 2023 (Ministry of Law & Justice / India Code)

• Website: https://www.indiacode.nic.in/handle/123456789/20062

⚖️ గమనిక  

• ఈ వెబ్‌సైట్‌లోని సమాచారం కేవలం ప్రజలకు చట్టాలపై ప్రాథమిక అవగాహన (Educational & Informational Purpose) కల్పించడం కోసం మాత్రమే ప్రచురించబడింది.

• ఇది అధికారిక న్యాయ సలహా (Legal Advice) కాదు. మీ వ్యక్తిగత లేదా నిర్దిష్ట చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత న్యాయవాదిని (Advocate / Legal Advisor) నేరుగా సంప్రదించండి.

✍️ సూచనలు & సవరణలు (Feedback):

• చట్టంలోని నిబంధనలను వీలైనంత కచ్చితంగా తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించడం జరిగింది. ఇందులో ఏవైనా అక్షర దోషాలు, సాంకేతిక పొరపాట్లు లేదా అనువాద లోపాలు మీ దృష్టికి వస్తే, దయచేసి కామెంట్స్ లేదా మా కాంటాక్ట్ పేజీ ద్వారా మాకు తెలియజేయగలరు. మీ విలువైన సలహాలను స్వీకరించి వెంటనే సరిదిద్దుతాము.

————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *